హైదరాబాద్‌కు ప్రమాద ఘంటికలు.. విపత్తులను తట్టుకోలేని నగరాల్లో రెండో స్థానం!
అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్‌కు అంతర్జాతీయ అధ్యయనం షాకింగ్ హెచ్చరికలు జారీ చేసింది. అత్యధిక ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం తక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో మరో భారత నగరం అహ్మదాబాద్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ‘ఆల్ఫాజియో’ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచంలోని పలు నగరాలు ఎదుర్కొంటున్న ప్రకృతి విపత్తుల ముప్పు, వాటిని ఎదుర్కొనే మౌలిక వసతులు, సన్నద్ధత వంటి అంశాలను విశ్లేషించారు....