కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల వద్దకు లక్ష మందితో వెళ్దాం: కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో సాగునీటి ప్రాజెక్టుల అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారీ కార్యక్రమం చేపట్టాలని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. త్వరలోనే లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల వద్దకు వెళ్లాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణకు నీళ్ల కోసం అవసరమైతే తాను స్వయంగా పాదయాత్ర కూడా చేస్తానని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సాగునీటి అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని...