Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ హౌస్‌లోకి ఝాన్సీ.. అగ్నిపరీక్ష 2 విజేతకు డైరెక్ట్ ఎంట్రీ

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు షో ప్రారంభం కానుండగా.. ఈసారి సీజన్‌ను ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే తొలి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అగ్నిపరీక్ష 2 విజేతగా నిలిచిన ఫోక్ సింగర్ ఝాన్సీకి బిగ్‌బాస్ తెలుగు 10లోకి డైరెక్ట్ ఎంట్రీ లభించింది. 15 మంది పోటీదారులతో సాగిన అగ్నిపరీక్ష పోటీలో చివరకు...