జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి 10 గొప్ప బోధనలు.. జీవితాన్ని మార్చే గీతా సందేశాలు ఇవే!
శ్రీకృష్ణుడు.. ఈ పేరు వినగానే నెమలి పింఛం, చేతిలో వేణువు, ముఖంపై చిరునవ్వుతో కనిపించే కన్నయ్య రూపం మన కళ్లముందు మెదులుతుంది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయాలు, ఇళ్లు కన్నయ్య నామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తులు ఉపవాసాలు ఉండి, అర్ధరాత్రి స్వామివారి జన్మవేళ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. జన్మాష్టమి మరుసటి రోజు సెప్టెంబర్ 5న పలు ప్రాంతాల్లో దహీ హండి వేడుకలు కూడా జరగనున్నాయి. కృష్ణుడి బాల్యంలోని అల్లరి చేష్టలను గుర్తుచేసుకుంటూ యువత ఉత్సాహంగా...