‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’.. జనసేన యువజన విభాగానికి అదే పేరు! పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఆవిష్కరణ

‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి గలవోడా..’ తెలుగు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ఈ గేయంలోని ‘జైకొట్టు’ పదం ఇప్పుడు జనసేన పార్టీ యువజన విభాగం పేరుగా మారింది. పార్టీ ఆవిర్భావం జరిగిన 12 ఏళ్ల తర్వాత జనసేన తొలిసారిగా ప్రత్యేక యువజన విభాగాన్ని ఏర్పాటు చేసింది. ‘జై కొట్టు’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విభాగాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా బుధవారం పిఠాపురంలో ఆవిష్కరించారు. పార్టీతో అనుబంధం ఉన్న యువతను ప్రత్యేక వేదికపైకి తీసుకురావడంతో పాటు.. ముఖ్యంగా జెన్‌జీని...