శ్రీకృష్ణునికి ఇష్టమైనవిగా భావించే ఈ 5 వస్తువులు.. జన్మాష్టమికి ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదమట!

Krishna Janmashtami Telugu: శ్రీకృష్ణ జన్మాష్టమి హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ రోజున భక్తులు బాలకృష్ణుడిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. పాలు, పెరుగు, వెన్న, పంచామృతం, పండ్లు తదితర నైవేద్యాలను సమర్పిస్తారు. కృష్ణుడి జన్మ సమయాన్ని సూచిస్తూ అర్ధరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా ఆనవాయితీ. హిందూ మత సంప్రదాయాలు, విశ్వాసాల ప్రకారం.. శ్రీకృష్ణుడితో అనుబంధం ఉన్న కొన్ని వస్తువులను జన్మాష్టమి సందర్భంగా ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. వీటిని పూజా మందిరంలో ఉంచడం ద్వారా ఇంట్లో సానుకూల...