ఆనంద్ సాయి కుమారుడు సందీప్ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ట్విస్ట్‌.. బెయిల్‌ వచ్చిన గంటల్లోనే వైరల్‌ వీడియో!

ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌కు సంబంధించిన హిట్‌ అండ్‌ రన్‌ కేసు మరో మలుపు తిరిగింది. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమయ్యాడనే ఆరోపణలతో కేసు ఎదుర్కొంటున్న సందీప్‌కు బెయిల్‌ లభించిన కొద్ది గంటల్లోనే.. అతడు గంజాయి వినియోగిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఓ పాత వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పరిణామంతో పోలీసులు దర్యాప్తును మరో కోణంలో కొనసాగిస్తున్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత కేసు నమోదు ఈ నెల 1న రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ...