PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 7:48 am Posted by : News Desk

కిచ్చా సుదీప్‌కు బర్త్‌డే సర్‌ప్రైజ్.. ‘దేవరాయ’గా అదరగొట్టిన స్టార్ హీరో!

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ‘దేవరాయ’ చిత్రబృందం. సుదీప్ నటిస్తున్న ఈ చారిత్రాత్మక సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.ఈ చిత్రంలో సుదీప్.. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ప్రసిద్ధ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నారు. ‘‘కన్నడ రాజ్య రామ రమణ.. మూడు రాయరా గండ.. ఆంధ్ర భోజ.. శ్రీకృష్ణదేవరాయ’’ అనే బిరుదులతో సినిమాను అధికారికంగా ప్రకటించారు.

భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చారిత్రక నేపథ్యం, సుదీప్ లుక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.‘దేవరాయ’ చిత్రాన్ని 2027 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.