PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 7:35 am Posted by : News Desk

దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశం

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ ఆమె తండ్రి సతీష్ సాలియన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించింది.

బుధవారం తీర్పు వెలువరించిన హైకోర్టు.. సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని, అలాగే సతీష్ సాలియన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని ఆదేశించింది.

అయితే దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నేరస్తులుగా పరిగణించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు దర్యాప్తు సంస్థ అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.