తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు.. 20 శాతం లోటు
తెలంగాణలో ఈ ఏడాది వర్షాకాలం ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 20 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల్లో సాధారణంగా 581 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 462 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నెలలో ఏకంగా 42 శాతం వర్షపాతం లోటు నమోదైంది....