PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 9:16 am Posted by : News Desk

తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు.. 20 శాతం లోటు

తెలంగాణలో ఈ ఏడాది వర్షాకాలం ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 20 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్‌ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల్లో సాధారణంగా 581 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 462 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నెలలో ఏకంగా 42 శాతం వర్షపాతం లోటు నమోదైంది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో తీవ్ర వర్షపాత లోటు ఉండగా.. మరో 13 జిల్లాల్లో సాధారణ స్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో వ్యవసాయ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.