ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. గ్లెన్ ఫిలిప్స్ అద్భుతం!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2026లో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుత ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫిలిప్స్ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ట్రిన్‌బాగో బ్యాటర్ సునీల్ నరైన్ భారీ షాట్ ఆడగా.. బంతి సిక్సర్‌గా వెళ్తుందని భావించిన సమయంలో ఫిలిప్స్ బౌండరీ వద్ద అద్భుతంగా స్పందించాడు. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకుని సిక్సర్‌ను క్యాచ్‌గా మార్చాడు. మరోవైపు గయానా...