శామీర్‌పేట్‌లో: గంజాయి చాక్లెట్ల కలకలం.. పాన్‌షాప్ నిర్వాహకుడి అరెస్ట్
శామీర్‌పేట్: పాన్‌షాప్ ముసుగులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని శామీర్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన బైద్‌నాథ్ పాన్‌షాప్ నిర్వహిస్తూ గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 25 కిలోల బరువున్న 5,298 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా యువత, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని ఈ చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.