రాయదుర్గంలో ఎకరం భూమి రూ.264 కోట్లు.. టీజీఐఐసీ వేలంలో రికార్డు ధర
తెలంగాణలో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడైంది. టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలానికి భారీ స్పందన రావడంతో ఈ ధర నమోదైంది. టీజీఐఐసీ భూముల వేలంలో ఎకరానికి ఇంత భారీ ధర పలకడం రికార్డుగా నిలిచింది. హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో భూములకు ఉన్న డిమాండ్‌కు ఈ ధర మరోసారి నిదర్శనంగా మారింది.