PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 1:33 pm Posted by : Pradeep Medchal Reporter 🗞️

మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.

మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

 

మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

 

ముఖ్యంగా 22Aకి సంబంధించిన రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, వాటి పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్‌కు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

 

అలాగే ఇతర పెండింగ్ రిజిస్ట్రేషన్ల వివరాలను కూడా పరిశీలించిన కలెక్టర్.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.