విజయసాయి రెడ్డి కొత్త పార్టీ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి సొంత కుంపటి!

మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తన రాజకీయ పునఃప్రవేశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ.. సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తన కొత్త పార్టీకి శ్రీవారి ఆశీస్సులు కోరినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల పక్షాన...