‘ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు.. అందుకే పదవులు దక్కలేదు!’ రాజాసింగ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో స్పందించారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కకపోవడానికి రాష్ట్రంలో కొనసాగుతున్న వర్గ రాజకీయాలే కారణమై ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులకు బీజేపీ జాతీయ స్థాయిలో కీలక పదవులు లభించేవని గుర్తుచేసిన రాజాసింగ్.. ఈసారి జాతీయ కార్యవర్గంలో రాష్ట్రం నుంచి ఒక్కరికీ అవకాశం రాకపోవడం బాధాకరమన్నారు. ఈ పరిణామంపై రాష్ట్ర నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ‘ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవద్దు’ రాష్ట్ర...