7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు

సొంత భవనాలు లేని 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు.  ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సభ దృష్టికి తీసుకువచ్చారు.  దీనిపై స్పందించిన లోకేశ్, ప్రస్తుతం ఆ కళాశాలలో విద్యార్థుల సంఖ్య 103కి చేరిందని, కళాశాలకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని తెలిపారు.  ప్రత్యేక పథకం కింద ఆళ్లగడ్డ కాలేజీకి కొత్త భవనం, ధ్వంసమైన ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.  ఒక్కో డిగ్రీ...