బ్యాంకు లాకర్‌లో ఎంత బంగారం పెట్టుకోవచ్చు? ఆర్‌బీఐ రూల్స్ ఇవే
బ్యాంకు లాకర్‌లో బంగారం భద్రపరుచుకునే విషయంలో ఆర్‌బీఐ ఎలాంటి గరిష్ఠ పరిమితిని విధించలేదు. అంటే లాకర్ సామర్థ్యానికి అనుగుణంగా ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు. అయితే లాకర్‌లో ఉన్న బంగారానికి బ్యాంకు బాధ్యత విషయంలో కీలక పరిమితి ఉంది. బ్యాంకు నిర్లక్ష్యం, చోరీ, అగ్నిప్రమాదం లేదా సిబ్బంది మోసం వంటి కారణాలతో నష్టం జరిగితే.. లాకర్ వార్షిక అద్దెకు గరిష్ఠంగా 100 రెట్లు మాత్రమే పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు ఏడాదికి రూ.3,000 లాకర్ అద్దె చెల్లిస్తే.. నష్టం జరిగిన సందర్భంలో గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు...