హైదరాబాద్‌ భూములపై 22-ఏ ఉచ్చు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో 22-ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి విధానం కారణంగా నగరంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు, ఆస్తి యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. విలువైన ప్రైవేట్‌, ప్రభుత్వ, అసైన్డ్‌ తదితర భూములు వివాదాల్లోకి వెళ్లేలా పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శిస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసి భూభారతిని అమల్లోకి తీసుకురావడం ద్వారా పాత రెవెన్యూ సమస్యలకు మళ్లీ అవకాశం కల్పించిందని...