మేడ్చల్‌లో 270 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత.
మేడ్చల్‌లో 270 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత మేడ్చల్: పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మేడ్చల్ పోలీసులు, పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. డబిల్‌పూర్ కమ్మాన్ సమీపంలోని జాతీయ రహదారి-44పై శనివారం వాహనాన్ని తనిఖీ చేయగా 540 బస్తాల్లో 270 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. షామీర్‌పేట్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. పంచుల సమక్షంలో డబిల్‌పూర్ కమ్మాన్ వద్ద **భారత్ బెంజ్ వాహనం (జీజే-25-యూ-5532)**ను అడ్డుకుని తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న...