PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 4:16 pm Posted by : Pradeep Medchal Reporter 🗞️

మేడ్చల్‌లో 270 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత.

మేడ్చల్‌లో 270 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

మేడ్చల్‌: పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మేడ్చల్‌ పోలీసులు, పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. డబిల్‌పూర్‌ కమ్మాన్‌ సమీపంలోని జాతీయ రహదారి-44పై శనివారం వాహనాన్ని తనిఖీ చేయగా 540 బస్తాల్లో 270 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.

షామీర్‌పేట్‌ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. పంచుల సమక్షంలో డబిల్‌పూర్‌ కమ్మాన్‌ వద్ద **భారత్‌ బెంజ్‌ వాహనం (జీజే-25-యూ-5532)**ను అడ్డుకుని తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న బియ్యం బయటపడింది.

బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు వాహనాన్ని సీజ్‌ చేసి, అక్రమ రవాణాకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేదలకు పంపిణీ చేయాల్సిన పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.