మటన్‌ షాపులోకి 15 అడుగుల కొండచిలువ.. మెడకు చుట్టుకున్న మందుబాబు!

ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకీలో ఓ మటన్‌ దుకాణంలోకి సుమారు 15 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ప్రవేశించడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. శుక్రవారం (ఆగస్టు 14) రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మటన్‌ షాపులోకి వచ్చిన కొండచిలువ అక్కడ ఉన్న మేకల వైపు వెళ్లింది. దీంతో భయపడిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతలో సురేష్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో అక్కడికి వచ్చాడు. చుట్టూ ఉన్నవారు భయపడుతున్నా.. అతడు మాత్రం కొండచిలువను చూసి ఏ మాత్రం వెనక్కి...