సూర్యాపేటలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. ముగ్గురికి గాయాలు
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఢీకొన్న సమయంలో ఓ బస్సు డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి అతడిని సురక్షితంగా బయటకు తీశారు. డ్రైవర్ల నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.