నవంబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను తితిదే ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను భక్తులకు అందుబాటులో ఉంచనుంది.
ఈ సేవా టికెట్ల కోసం నిర్వహించే ఎలక్ట్రానిక్ డిప్‌లో పాల్గొనేందుకు ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో ఎంపికైన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నంలోపు నిర్ణీత సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది.
ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా భక్తులు తమకు నచ్చిన ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తితిదే తెలిపింది.