శ్రీశైలం ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్‌.

శ్రీశైలం(Srisailam) మ‌ల్లికార్జున స్వామి వారి ఆల‌యానికి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. ఆదివారం సెల‌వు దినం కావడంతో స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. దీంతో ఆల‌యానికి వెళ్లే ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic ,) ఏర్ప‌డింది. కాగా, స్వామివారి ద‌ర్శ‌నానికి 4 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆల‌య అధికారులు తెలిపారు.