మేడ్చల్:గిర్మాపూర్‌లో చైన్ స్నాచింగ్.

గిర్మాపూర్‌లో చైన్ స్నాచింగ్  మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో చైన్ స్నాచర్లు హల్‌చల్ చేశారు. ఆదివారం ఉదయం రహదారిపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న జక్కుల సుజాత (58) మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కొని పరారయ్యారు. ఊహించని ఘటనతో భయాందోళనకు గురైన సుజాత బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారి సహాయంతో ఆమె వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చైన్ స్నాచర్ల కోసం...