ప్రసవం కోసం వస్తే.. గాంధీకి రెఫర్‌? మేడ్చల్‌లో వైద్య సేవలపై ఆరోపణలు.

ప్రసవం కోసం వస్తే.. గాంధీకి రెఫర్‌? మేడ్చల్‌లో వైద్య సేవలపై ఆరోపణలు మేడ్చల్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు ప్రసవ సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్‌ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ప్రసవం కోసం వచ్చే గర్భిణులను స్థానికంగానే ప్రసవం చేయకుండా గాంధీ ఆసుపత్రికి తరలించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రసవం సమీపించిన ఓ గర్భిణీని మేడ్చల్‌ నుంచి 108 అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా బోయినపల్లి వద్ద అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. దీంతో 108 సిబ్బంది అత్యవసర...