స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు అదే నిజమైన నివాళి.. చంద్రబాబు భావోద్వేగ పోస్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడమే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. “దేశం నాకు ఏం చేసిందని కాకుండా.. దేశానికి నేను ఏం చేయగలనని ప్రతి ఒక్కరూ ‘అనే నేను..’...