Jammu Kashmir: ఉగ్ర కమాండర్ తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం.. షోపియాన్‌లో ఆసక్తికర దృశ్యం
Jammu Kashmir Independence Day | దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. షోపియాన్‌లో భద్రతా సంస్థల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న లష్కర్-ఎ-తైబా కమాండర్ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటి పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ఊపుతూ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. ఉగ్ర కమాండర్ తల్లిదండ్రుల ఇంటిపై జాతీయ జెండా అబిద్ రంజాన్ షేక్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భద్రతా వర్గాలు...