భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఆకట్టుకుంటున్న గూగుల్ ప్రత్యేక డూడుల్
న్యూఢిల్లీ: భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతుండగా.. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కూడా ప్రత్యేక డూడుల్‌తో భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించారు. భారతీయ వస్త్ర కళల నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్‌లో ప్రకాశవంతమైన రంగులు, సంప్రదాయ నమూనాలు, కళాత్మక అంశాలను ఉపయోగించారు. దీంతో గూగుల్ హోమ్‌పేజీపై కనిపిస్తున్న ఈ డూడుల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ‘వికసిత్...