ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ‘స్వర్ణాంధ్ర-2047’ థీమ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వాతంత్య్ర వేడుకలను నిర్వహిస్తోంది.
రాజధాని అమరావతిలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.