తెలుగులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, గ్రీటింగ్స్!
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి ఉప్పొంగుతోంది. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా మనకు స్వేచ్ఛ లభించింది. ఈ ప్రత్యేక రోజున వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి సందేశాలు, శుభాకాంక్షలు, గ్రీటింగ్స్‌ను మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో పంచుకుందాం. ఆగస్టు 15న సోషల్ మీడియాలో షేర్ చేసుకునేందుకు కొన్ని ప్రత్యేక తెలుగు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, కోట్స్ ఇవిగో.. 🇮🇳 1. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ.....