గుంతలతో ఇబ్బందులు.. బీజేపీ ప్రతినిధుల వినతితో రోడ్డు మరమ్మతులు
మేడ్చల్: మేడ్చల్ డివిజన్ పరిధిలో రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బీజేపీ తరఫున సంబంధిత అధికారులకు ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది. ప్రజల సమస్యపై సానుకూలంగా స్పందించిన CMC మేడ్చల్ డివిజన్ ఏఈ మమత వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గుంతలను పూడ్చి రహదారిని ప్రయాణానికి అనుకూలంగా మార్చేందుకు చర్యలు తీసుకున్న ఏఈ మమత చొరవను బీజేపీ నాయకులు అభినందించారు. ఈ...