PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 11:22 am Posted by : News Desk

గుంతలతో ఇబ్బందులు.. బీజేపీ ప్రతినిధుల వినతితో రోడ్డు మరమ్మతులు

మేడ్చల్: మేడ్చల్ డివిజన్ పరిధిలో రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బీజేపీ తరఫున సంబంధిత అధికారులకు ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది.

ప్రజల సమస్యపై సానుకూలంగా స్పందించిన CMC మేడ్చల్ డివిజన్ ఏఈ మమత వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గుంతలను పూడ్చి రహదారిని ప్రయాణానికి అనుకూలంగా మార్చేందుకు చర్యలు తీసుకున్న ఏఈ మమత చొరవను బీజేపీ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా మేడ్చల్ డివిజన్ బీజేపీ కార్యదర్శి బండి విష్ణుమూర్తి గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం తమ బాధ్యత అన్నారు. ప్రజా సమస్య ఏదైనా పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ప్రజల ఇబ్బందులను గుర్తించి వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించిన CMC మేడ్చల్ డివిజన్ ఏఈ మమతకు బండి విష్ణుమూర్తి గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు బొజ్జ రాఘవ రెడ్డి, మేడ్చల్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జకట ప్రేమదాస ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.