త్రివర్ణ కాంతుల్లో ఆదియోగి.. కోయంబత్తూరులో కనువిందు చేసిన అద్భుత దృశ్యం

కోయంబత్తూరు: స్వాతంత్ర్య దినోత్సవ వేళ కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 112 అడుగుల ఆదియోగి శివుని విగ్రహం మువ్వన్నెల కాంతులతో వెలిగిపోతూ సందర్శకులను ఆకట్టుకుంది. రాత్రి వేళ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల లేజర్ లైట్లతో ఆదియోగి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే ఆదియోగి.. త్రివర్ణ వెలుగుల్లో మరింత అద్భుతంగా కనిపించాడు. దేశభక్తి, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ అపురూప దృశ్యాలను చూసేందుకు వచ్చిన భక్తులు, పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో...