గుడి పులిహోర రుచి అంత ప్రత్యేకంగా ఎందుకు ఉంటుంది? చింతపండు నుంచి పోపు వరకు అసలు సీక్రెట్ ఇదే!

దేవాలయానికి వెళ్లినప్పుడు ప్రసాదంగా పులిహోర లభిస్తే చాలామంది ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. ఇంట్లో ఎన్నిసార్లు పులిహోర చేసినా.. గుడిలో ఇచ్చే పులిహోర రుచికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. చింతపండు పులుపు, పోపు వాసన, వేరుశెనగల కరకరలాడే రుచి, కరివేపాకు సువాసన కలిసి దానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. అయితే గుడి పులిహోరలో రుచితో పాటు ఆధ్యాత్మికత కూడా ముడిపడి ఉంది. స్వామివారికి నైవేద్యంగా సమర్పించి, అనంతరం భక్తులకు ప్రసాదంగా అందించే ఈ వంటకం దక్షిణ భారతీయ ఆలయ సంప్రదాయంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. పులిహోర...