స్టోర్లలో సామగ్రి కొరత.. శివారు డివిజన్లలో ‘దందా’ ఆరోపణలు!

కాంట్రాక్టర్లకు అవసరానికి మించి మెటీరియల్‌ విడుదల? ఎస్టిమేషన్లలో అదనపు సామగ్రి చేర్చుతున్నారన్న ఆరోపణలు లైన్‌మెన్లకు అందాల్సిన మెటీరియల్‌ కూడా కాంట్రాక్టర్ల వద్దే.. అధికారులు–కాంట్రాక్టర్ల కుమ్మక్కుపై క్షేత్రస్థాయిలో గుసగుసలు హైదరాబాద్‌: ఒకవైపు విద్యుత్‌ సంస్థల స్టోర్లలో అవసరమైన సామగ్రి కొరతతో పనులు ఆలస్యమవుతుండగా.. మరోవైపు కొన్ని శివారు డివిజన్లలో మాత్రం కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో మెటీరియల్‌ విడుదలవుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గత రెండేళ్లుగా స్టోర్లలో సామగ్రి కొరత కారణంగా సాధారణ పనులు కూడా సకాలంలో పూర్తి చేయలేకపోతున్నామని పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అయితే కొందరు...