దేవుడిని ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి? భక్తి తగ్గిపోయిందా? తెలుసుకోండి

“ప్రార్థన చేయడానికి కూర్చున్నాను.. కానీ మనసు మాత్రం ఎక్కడెక్కడికో వెళ్తోంది.” “దేవుడి ముందు ఉన్నప్పుడు అసలు రావద్దనుకున్న ఆలోచనలే ఎందుకు వస్తున్నాయి?” ఇలా అనిపించడం చాలామందికి అనుభవమే. దైవాన్ని ప్రార్థించే సమయంలో మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మనసు మనం అనుకున్నట్టుగా ఎప్పుడూ పనిచేయదు. ఒక్కసారిగా గత సంఘటనలు, భవిష్యత్తు గురించి ఆందోళనలు, పని విషయాలు, కుటుంబ సమస్యలు లేదా మనకు అసలు నచ్చని ఆలోచనలు కూడా గుర్తుకు రావచ్చు. ఇలాంటి సమయంలో కొందరు “నా భక్తి నిజమైనది...