15 రోజుల్లో జుట్టు పెరుగుతుందా? కొబ్బరి నూనెలో లవంగాలు, మందారం, కరివేపాకు, కలోంజి.. ఈ వైరల్ రెసిపీ నిజమెంత?
జుట్టు రాలడం మొదలైతే చాలామందికి ఆందోళన మొదలవుతుంది. జుట్టు పల్చబడటం, ముందుభాగంలో హెయిర్ లైన్ తగ్గడం, చిట్లిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే ఏదైనా హెయిర్ రెమెడీ కోసం వెతుకుతుంటారు. ఇటీవల సహజ పదార్థాలతో ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకునే పద్ధతులు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ముఖ్యంగా కొబ్బరి నూనె + లవంగాలు + మందారం + కరివేపాకు + కలోంజి కలయికతో తయారు చేసే నూనె జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుందనే ప్రచారం కనిపిస్తోంది. ఈ రెసిపీని ఎలా తయారు...