ధరల మంట.. పెరిగిన ఇన్‌ఫ్లేషన్!

సామాన్య ప్రజలకు మరోసారి ధరల సెగ తగులుతోంది. దేశంలో ఆహార పదార్థాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 4.45 శాతానికి చేరింది. జూన్‌లో ఇది 4.38 శాతంగా ఉండగా.. నెల వ్యవధిలో స్వల్పంగా పెరిగింది. జులైలో ఆహార ద్రవ్యోల్బణం కూడా 5.52 శాతానికి పెరిగింది. జూన్‌లో ఇది 5.32 శాతంగా ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. అల్లం ధరలు ఏకంగా 83.62% పెరుగుదల ఆహార పదార్థాల్లో కొన్ని కూరగాయలు,...