తెలంగాణలో అసలు సమస్యలేంటి? హామీల అమలుపై పెరుగుతున్న ప్రశ్నలు

తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లకు చేరుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల అమలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై చర్చ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పలు హామీలను అమలు చేశామని చెబుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం ఇంకా అనేక హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఒకవైపు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరోవైపు అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆరు గ్యారెంటీల...