భారీగా పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు!

Fuel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు–2026ను శాసనసభలో ఆమోదించినట్లు సమాచారం.ఈ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పెట్రోల్‌, డీజిల్‌పై గరిష్టంగా లీటరుకు రూ.5 వరకు అదనపు పన్ను/సెస్‌ విధించే అధికారం లభించనుంది. అయితే ఈ ఆదాయాన్ని వితంతువులు, నిరుపేదలు, ఇతర అర్హుల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలనే ఉద్దేశంతో...