శ్రావణంలో 16 సోమవారాల వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం పాటించే నియమాలివే!
శ్రావణ మాసం అంటేనే శివనామస్మరణ. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమశివుడి ఆరాధనకు ఎంతో విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శ్రావణ మాసంలో 16 సోమవారాల వ్రతాన్ని ప్రారంభించడం శుభప్రదం అని హిందూ సంప్రదాయాల్లో నమ్మకం. వరుసగా 16 సోమవారాలు శివుడిని భక్తితో పూజిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పార్వతీదేవి తపస్సు పురాణ కథనాల ప్రకారం.. పార్వతీదేవి పరమశివుడిని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేసింది. శివుడిపై ఆమెకున్న అచంచల భక్తికి...