బాలికపై లైంగిక దాడి.. తల్లి సహకరించిందని ఆరోపణలు
అనకాపల్లి: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన అనకాపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సచివాలయ ఉద్యోగి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసినప్పటికీ బాలిక తల్లి అడ్డుకోకుండా నిందితుడికి సహకరించిందని ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులు విచారణ చేపట్టగా, బాలిక తనపై జరిగిన దాడి గురించి వివరించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.