రేవంత్ సర్కార్‌కు వరుస షాక్‌లు.. కేటీఆర్ ఆరోపణలతో తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి వరుస విమర్శలు, ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలను కేటీఆర్ పదేపదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వంపై భూ కేటాయింపులు, టెండర్ల విషయంలోనూ కేటీఆర్ ఆరోపణలు చేయడంతో రాజకీయ దుమారం మరింత పెరిగింది. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.బయటకు...