అమరావతి/హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.