PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 3:15 am Posted by : News Desk

ఈ నెల 23న శ్రీ గడి మైసమ్మ తల్లి బోనాల జాతర

  • మేడ్చల్: మేడ్చల్‌లో శ్రీ గడి మైసమ్మ తల్లి బోనాల జాతర ఈ నెల 23న ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. శ్రావణ మాసం సందర్భంగా జరిగే ఈ జాతరకు మేడ్చల్‌తో పాటు పరిసర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. జాతరకు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై అమ్మవారిని దర్శించుకోనున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు, పల్లారంబండ్లతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లపై నిర్వాహకులు దృష్టి సారిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గడి మైసమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.