లోన్ కావాలా? అంటూ మోసం.. ఢిల్లీ కాల్ సెంటర్‌లో 21 మంది అరెస్ట్!
తెలుగు రాష్ట్రాల ప్రజలను టార్గెట్ చేసి రుణాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా కాల్ సెంటర్ నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు ఢిల్లీలోని కాల్ సెంటర్‌ను గుర్తించారు. అక్కడ పనిచేస్తున్న 21 మంది తెలుగు యువతులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా గత 18 నెలలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారానికి అసలు సూత్రధారులు...