హైదరాబాద్: ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా హీరో సూర్యకు ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాల స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్‌కు కూడా సినిమా బాగా నచ్చిందని చెప్పారు. ‘అత్తారింటికి దారేది’లో పవన్ కళ్యాణ్ పాత్ర ప్రేక్షకులకు ఇచ్చిన కిక్‌లాగే.. ఈ సినిమాలో సూర్య పాత్ర కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని నాగవంశీ పేర్కొన్నారు.